ఇంగ్లాండ్- వెస్టిండీస్ : రెండో రోజు ముగిసిన ఆట ...

ఇంగ్లాండ్- వెస్టిండీస్ : రెండో రోజు ముగిసిన ఆట ...

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదట టెస్ట్ మ్యాచ్ లో రెండొవ రోజు ముగిసింది. అయితే ఆటలో ఈ రోజు ఆధిపత్యం చూపించింది కరేబియన్ల జట్టే. నిన్న ఆట ముగిసే సమయానికి  ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసిన ఆతిధ్య జట్టును ఈ రోజు టీ బ్రేక్ కంటే ముందే ఆల్ ఔట్ చేసారు. ఇక ఈ రెండు జట్ల తరపున వారి కెప్టెన్లు అద్భుతంగా రాణించారు.  ఇంగ్లాండ్ కెప్టెన్  స్టోక్స్(43) చేసి తమ మొదటి ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అలాగే  వెస్టిండీస్ కెప్టెన్  జాసన్ హోల్డర్ 6 వికెట్లతో చెలరేగిపోయాడు. దాంతో ఇంగ్లాండ్ 204 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగ్గిన కరేబియన్లు కూడా ప్రత్యర్థుల మాదిరిగానే త్వరగా జాన్ కాంప్‌బెల్(28) వికెట్ కోల్పోయారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రైగ్ బ్రాత్‌వైట్(20),  షాయ్ హోప్,(6) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆ ఒక్క వికెట్ తీసుకున్నాడు.