2పాయింట్ 0 సెన్సార్ రిపోర్ట్..!!

2పాయింట్ 0 సెన్సార్ రిపోర్ట్..!!

2 పాయింట్ 0 సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్నది.  దీంతో సినిమా నవంబర్ 29 రిలీజ్ కావడం ఖాయం అనే విషయం తేలిపోయింది.  గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.  

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విధంగా ఉండబోతుందని అంటున్నారు.  ప్రారంభం దగ్గరి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి కూర్చుండిపోతారట.  కొన్ని సన్నివేశాలు ఊహకు అందని విధంగా ఉంటాయని సెన్సార్ రిపోర్ట్ ను బట్టి తెలుస్తున్నది.  

రజినీకాంత్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్.  శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.