2 పాయింట్ ఓ బయ్యర్లను నిలబెడుతుందా..?
రజినీకాంత్ 2 పాయింట్ ఓ సినిమా బిజినెస్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పూర్తయింది. టాలీవుడ్ లో ఈ సినిమాను ఎన్ వీ ఆర్ సినిమా సొంతం చేసుకున్నది. దాదాపు రూ.80 కోట్ల రూపాయలు వెచ్చింది ఈ సినిమాను సొంతం చేసుకోవడం విశేషం. ఎన్.వీ.ఆర్ సినిమా గతంలో రజినీకాంత్ బాబా, కొచ్చాడియన్, కాలా సినిమాలను తీసుకున్నది. బాబా సినిమాకు భారీ లాస్ రావడంతో.. రజినీకాంత్ పిలిచి మరి డబ్బు వెనక్కి ఇచ్చినట్టుగా ఎన్వీ పేర్కొన్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ పై నమ్మకంతో ఆయన సినిమాలను భారీ ఎత్తున కొనేస్తున్నారు.
2 పాయింట్ ఓ విషయంలో ఇది మరోసారి నిరూపణ అయింది. కాలా సినిమాను కూడా ఎన్వీఆర్ సంస్థ తీసుకున్నది. లాభాలు రాకపోయినా.. బొటాబొటీనా డబ్బులు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రోబో కోసం ఏకంగా రూ.80 కోట్లు వెచ్చించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. గతంలో రోబో 2 పాయింట్ ఓ ను ఏషియన్ సినిమాలు తీసుకున్నా.. సినిమా విడుదల తేదీ ఆలస్యం కావడంతో.. డిస్ట్రిబ్యూషన్ నుంచి పక్కకు తప్పుకున్నది.
ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఎన్వీఆర్ సినిమా వచ్చింది. ఎన్వీప్రసాద్, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను తీసుకున్నాయి. సినిమాకు భారీ హైప్ రావడంతో ఆ హైప్ ను క్యాష్ చేసుకోవాలనే నమ్మకంతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు. బాహుబలి 2 మాదిరిగానే ఈ సినిమాకు ఆ హైప్ వస్తే.. పెట్టిన పెట్టుబడి రెండు రోజుల్లోనే తిరిగి వెనక్కి రావడమే కాకుండా లాభాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. బాహుబలి 2 సినిమాను ప్రమోషన్స్ పరంగా భారీ ఎత్తున నిర్వహించారు. అలాగే, మొదటి పార్ట్ విజయం కూడా దీనికి కలిసి వచ్చింది.
బాహుబలి పీరియాడికల్ సినిమా కావడంతో ఆసక్తి నెలకొన్నది. పైగా అలాంటి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ కాలంలో తప్పా.. తరువాత రాలేదు. ఇది ఈ సినిమాకు కలిసి వచ్చింది. రోబో లాంటి సైంటిఫిక్ సినిమాలు హాలీవుడ్ లో తరచుగా వస్తున్నాయి. వాటిని ఇక్కడ కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకు అవెంజర్స్ ది ఇన్ఫినిటీ వార్ సినిమా. ఇది ఇండియాలో విపరీతంగా కలెక్షన్లు కలెక్ట్ చేసింది. రోబో పార్ట్ 1 విజయం సాధించడంతో.. అదే ఊపుతో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. తెలుగు రూ. 100 కోట్లు వసూలు చేస్తోందో లేదో తెలియాలంటే నవంబర్ 29 వరకు ఆగాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)