కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జైషే మహ్మద్ కమాండర్ మేనల్లుడు హతం..

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..  జైషే మహ్మద్ కమాండర్ మేనల్లుడు హతం..

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు... జైషే మహ్మద్ కమాండర్ మసూద్ అజ్‌హర్ మేనల్లుడు మహ్మద్ ఉస్మాన్ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.. మహ్మద్ ఉస్మాన్‌ ఐఈడీ పేలుడు పదార్ధాల తయారీలో నిపుణుడిగా గుర్తింపు పొందాడు. పుల్వామాలోని కంగన్‌ ప్రాంతంలో ఈ ఉదయం భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉస్మాన్ చనిపోయాడు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని ఘటనాస్థలం నుంచి భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.