చర్లలో ఎన్‌కౌంటర్‌

చర్లలో ఎన్‌కౌంటర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు భద్రతదళాలు, అటు మావోయిస్టుల ఎదురుకాల్పులతో దద్దరిల్లింది... చర్ల మండలం కుర్లాపల్లి అడవీప్రాంతలో మావోయిస్టులకు భద్రతదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది... ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారిలో మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమాండర్ అర్జున్ ఉన్నట్లు  సమాచారం. చర్ల సరిహద్దు అటవీప్రాంతంలోని కుర్ణపల్లి సమీపంలో ఎదురుకాల్పులు కొనసాగుతుండగా... మృతిచెందిన మావోయిస్టుల్లో ఒక డెడ్ బాడీని సత్యనారాయపురం సి.యర్.పి.ఎఫ్ క్యాంప్‌కు తరలించారు. కాల్పుల్లో ఒక మహిళ మావోయిస్టుకు గాయాలు కాగా... భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తలిస్తున్నట్లు తెలుస్తోంది.