వివాహితపై సామూహిక అత్యాచారం

వివాహితపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్ నగర నడి బొడ్డున బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవకముందే నగర శివార్లలో ఓ వివాహితపై శనివారం అర్థరాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టిస్తోంది. భర్తలేని సమయంలో ఇంట్లోకి దూరిన ఇద్దరు దుండగులు పిల్లలను చంపుతామని బెదిరించి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు.

వివరాల్లోకి వెళితే... హర్యానాకు చెందిన ఓ కుటుంబం బ్రతుకు తెరువు కోసం నగర శివార్లలోని వాదియే ముస్తఫాకు మూడు నెలల క్రితం వలస వచ్చింది. శాఖీర్ ఖాన్ కు భార్య (25), నలుగురు కుమారులు సంతానం. శాఖీర్ ఖాన్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. రాత్రిపూట ఆటో నడిపేవాడు. యధావిధిగా శాఖీర్ శనివారం రాత్రి ఆటో తీసుకుని వెళ్ళాడు. ఇది గమనించిన వారి బంధువులు అంజద్, హజం, మరో గుర్తు తెలియని వ్యక్తి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శాఖీర్ ఇంటికి వెళ్లారు. బందువులే కదా అతని భార్య తలుపు తెరిచింది.

మంచి నీళ్లు కావాలాని వారు అడగ్గా.. ఇంకో గదిలోకి వెళ్ళగానే ఆమె వెనకాలే అంజద్, హజంలు వెళ్లారు. మరో గుర్తు తెలియని వ్యక్తి మాత్రం పిల్లల వద్ద కాపలాగా ఉన్నాడు. ఒకరు ఆమెను బెదిరించి (పిల్లలను చంపుతామని) బందించగా.. మరొకరు అత్యాచారం చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి అక్కడి నుండి పరారయ్యారు. నిందితులు పారిపోగానే స్థానికుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.