పీవోకేలో మెరుపు దాడి: 3 ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. 10 మంది మృతి..!

పీవోకేలో మెరుపు దాడి:  3 ఉగ్ర స్థావరాలు ధ్వంసం.. 10 మంది మృతి..!

సరిహద్దుల్లో ఓవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరో వైపు సమయం చూపి ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబడేలా చేస్తూ వస్తోంది పాకిస్థాన్ సైన్యం.. ఇప్పటికే ఈ కుట్రలను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ.. ఆక్రమిత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర శిబిరాలు వెలిసాయని.. దాడులు తప్పవని హెచ్చరిస్తూ వచ్చింది. ఇక, ఇవాళ తంగ్ధార్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన కాల్పులు జరిపింది.. ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు విడవగా.. ప్రతీకార దాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ.. పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దీనిపై మీడియాతో మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్.. భారత భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తి ధ్వంసమైనట్టు వెల్లడించారు. 

కుప్వారా తంగ్ధర్ సెక్టార్ ఎదురుగా ఉన్న నీలం లోయలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఫిరంగి దాడుల్లో ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక ఈ దాడుల్లో ఆరు నుంచి 10 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారని తెలిపారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలపై దాడులు చేయగా.. వీటిలో మూడు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. మరో స్థావరం స్వల్పంగా దెబ్బతినట్టు విల్లడించారు ఇండియన్ ఆర్మీ చీఫ్.