నోట్ల రద్దుకు మూడేళ్లు.. ఉగ్రదాడితో పోల్చిన రాహుల్

నోట్ల రద్దుకు మూడేళ్లు.. ఉగ్రదాడితో పోల్చిన రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేసి నేటికి మూడేళ్లు పూర్తికావొస్తోంది.. అయితే.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పెద్ద నోట్ల రద్దును ఉగ్రవాదుల దాడితో పోల్చిన రాహుల్.. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని వ్యాఖ్యానించారు. అంతే కాదు నోట్ల రద్దు లక్షలాది మంది జీవితాలను సర్వనాశనం చేసిందని.. నోట్లరద్దుతో ప్రజల జీవితాలను రోడ్డున పడేశారని రాహుల్ విమర్శించారు. ఇలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడినవారికి ఇంకా శిక్ష పడలేదంటూ ట్వీట్ చేశారు రాహుల్.