స్టార్ హీరో సినిమాలో 300 మంది ఆర్టిస్టులు !

స్టార్ హీరో సినిమాలో 300 మంది ఆర్టిస్టులు !

స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వాసం'.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది.  తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సుమారు 300 మంది డ్రామా ఆర్టిస్టులు నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

అంతేగాక అనేక మంది నృత్య కళాకారులు, జానపద కళాకారులు కూడ ఈ సినిమాలో కనిపించనున్నారు.  ఇలా అనేక మంది నటిస్తున్న ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుందో చూడాలని తమిళ ప్రేక్షకులు ఉవ్విళూరిపోతున్నారు.  పాపులర్ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజిత్ తో 'వివేగం, వేదాళం, వీరం' సినిమాల్ని రూపొందించిన శివ డైరెక్ట్ చేస్తున్నారు.  తమిళంతో పాటు తెలుగులో కూడ ఈ చిత్రం విడుదలకానున్న ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటిస్తోంది.