అంతు చిక్కని వైరస్ : ముప్పై వేల కోళ్ళ మృతి 

అంతు చిక్కని వైరస్ : ముప్పై వేల కోళ్ళ మృతి 


వైరస్ సోకి ముప్పై వేల కు పైగా బాయిలర్ కోళ్ళు చనిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకుల గూడెం గ్రామ శివార్లలో ఉన్న కోళ్ల ఫారం సమీపంలో  భారీ సంఖ్యలో చనిపోయిన బాయిలర్ కోళ్లను పడవేయటంతో పెనుబల్లి తహశీల్దార్ కు నాయకుల గూడెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల పిర్యాదు తో కోళ్లను పడవేసిన ప్రాంతానికి పెనుబల్లి మండల రెవెన్యూ అధికారులు, వెటర్నరీ వైద్యులు, పోలీస్ లు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.సుమారు ముప్పై వేల కు పైగా కోళ్లను ఆరు బయట పడవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏ కారణంగా బాయిలర్ కోళ్ళు చనిపోయాయి అనే విషయం పై పరిశోధన చేస్తున్నట్లు పశు వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా చనిపోయిన కోళ్లను ఆరుబయట పడ వేసిన కోళ్ల ఫారం యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని పెనుబల్లి పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలు రకాల అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతూ మనుషులు అనారోగ్యాలకు గురి అవుతున్న క్రమం లో ఈ విధం గా భారీ సంఖ్యలో బాయిలర్ కోళ్ళు చనిపోవటం, వాటిన ఆరుబయట పడ వేయటం తో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.