భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి

భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి

ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రమాణనష్టం జరిగింది.. అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మందికి పైగా మృతిచెందినట్టు తెలుస్తోంది... మరో 50 మందిని రెస్క్యూ టీమ్‌లు కాపాడి.. సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. ఇక, మంటల్లో చిక్కుకొనే కొంతమంది సజీవదహనం అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 10 మందికి పైగా మృతిచెందారు. క్షతగాత్రుల్లో చాలా మందిని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి, హిందూ రావు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మంటలార్పేందుకు 30 ఫైరింజన్లతో శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది... మంటల్లో మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.