కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఆర్మీ జవాన్లు..

కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఆర్మీ జవాన్లు..

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది... రాజధాని సిమ్లా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలన్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద 35 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇండియన్ ఆర్మీ సైనికులు, వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఆర్మీ జవాన్లను బయటకి తీయగలిగారు సైనికులు.. సరైన పరికరాలు లేకపోవడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోనున్నాయని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా రెస్టారెంట్ ఉన్న భవనం కూలిపోయినట్టు తెలిపారు. ఉత్తరాఖండ్ వెళ్తున్న ఆర్మీ జవాన్లు, వారి కుటుంబసభ్యులు రెస్టారెంట్‌లో భోజనం చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.