బస్సు ప్రమాదం.. 45 మంది మృతి

బస్సు ప్రమాదం.. 45 మంది మృతి

ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌ పౌరిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు కొండప్రాంతం నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రంగా  గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 20 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని సమాపంలోని ఆసుపత్రికి తరలించారు.