కరోనా అప్డేట్: ఈరోజు మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 

కరోనా అప్డేట్: ఈరోజు మళ్ళీ పెరిగిన కరోనా కేసులు... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.  నిన్నటి కరోనా బులెటిన్ ప్రకారం 3503 కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కొత్తగా 3746 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,299 కి చేరింది.  ఇందులో 32,376 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  7,54,415 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో 27 మంది కరోనా మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 6508కి చేరింది.  అనంతపూర్ లో 301, చిత్తూరులో 437, తూర్పు గోదావరిలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణాజిల్లాలో 503, కర్నూల్ లో 65, నెల్లూరులో 116, ప్రకాశం జిల్లాలో 127, శ్రీకాకుళంఓ 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమ గోదావరి జిల్లాలో 519 కేసులు నమోదయ్యాయి.