కరోనా అప్డేట్: మరోసారి 40వేల దిగువకు కరోనా కేసులు 

కరోనా అప్డేట్: మరోసారి 40వేల దిగువకు కరోనా కేసులు 

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి.  చాల రోజుల తరువాత పాజిటివ్ కేసులు 40 వేలకు దిగువున నమోదయ్యాయి.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 38,772 కొత్త కేసులు నమోదయ్యాయి.  443 కరోనా మరణాలు సంభవించాయి.  భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,31,692కి చేరింది.  దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,37,139 కరోనా మరణాలు సంభవించాయి.  88,47,600 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,46,952 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో 45,333 మంది కోలుకున్నారు.