రేపే తుది విడత 'పంచాయతీ' పోలింగ్..

రేపే తుది విడత 'పంచాయతీ' పోలింగ్..

తెలంగాణలో మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా... ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసిపోయింది. ఇక తుది విడత పంచాయతీ పోలింగ్‌ రేపు నిర్వహించనున్నారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది... అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మూడో విడతలో 4,116 గ్రామపంచాయతీల్లో 10 గ్రామపంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాకపోగా.. 573 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,529 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 11,667 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 36729 వార్డుల్లో 185 వార్డులకు నామినేషన్ల దాఖలు కాలేదు.. 8,956 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా 27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.