కాళేశ్వరంలో మరో ముందడుగు

కాళేశ్వరంలో మరో ముందడుగు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద మూడో మోటర్ వెట్‌ రన్ విజయవంతమైంది. వెట్‌ రన్ విజయవంతం కావడంతో సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్‌ను అధికారులు ప్రారంభించనున్నారు. 126 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు పంపుల వెట్‌ రన్లు గత నెలలో విజయవంతంగా పరీక్షించారు. జూన్‌ రెండో వారం నాటికి ఆరో ప్యాకేజీలోని మొత్తం ఆరు పంపుల వెట్‌ రన్లను పూర్తి చేయాలన్నదే అధికారుల లక్ష్యం. ఇవాళ్టి మూడో వెట్‌ రన్‌ను నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు.