దేశంలో మొదటిసారి వారికోసం కరోనా బెడ్లు రిజర్వ్... 

దేశంలో మొదటిసారి వారికోసం కరోనా బెడ్లు రిజర్వ్... 

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్ ను, కోవిడ్ కేర్ సెంటర్స్ ను పెంచుతున్నారు.  హాస్పిటల్స్  లో ఇప్పటి వరకు బెడ్స్ రిజర్వేషన్ సౌకర్యం లేదు.  కరోనా రోగుల ఎంట్రీస్ లో మేల్, ఫిమేల్ ఇలా మాత్రమే రాసుకుంటారు.  అయితే, పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాలుగు బెడ్స్ ను రిజర్వ్ చేసి ఉంచుతున్నారు.  ట్రాన్స్ జెండర్ మేల్, ట్రాన్స్ జెండర్ ఫిమేల్ అనే రెండు కేటగిరిలుగా విభజించి వీరికోసం నాలుగు కరోనా బెడ్స్ రిజర్వ్ చేస్తున్నారు.  ఆ బెడ్స్ ను వారికి మాత్రమే కేటాయిస్తున్నారు.  ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించడం దేశంలో ఇదే మొదటిసారి.