శ్రీశైలం డ్యామ్‌ 4 గేట్లు ఎత్తివేత...

శ్రీశైలం డ్యామ్‌ 4 గేట్లు ఎత్తివేత...

ఎగువ నుంచి భారీఎత్తున నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం డ్యామ్‌లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది... శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 880.7 అడుగులుగా ఉంది. మరోవైపు 3.62 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది... దీంతో నాలుగు గేట్లను ఎత్తివేసి లక్ష క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... శ్రీశైలం డ్యామ్‌ నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు గేట్లు ఎత్తివేసిన తర్వాత శ్రీశైలం అందాలు చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.