హెచ్‌1బీ కేసులో నలుగురు భారతీయులను అరెస్టు

హెచ్‌1బీ కేసులో నలుగురు భారతీయులను అరెస్టు

అమెరికాలో నలుగురు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం హెచ్‌1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారన్న అభియోగంపై న్యూజెర్సీలో నివాసముంటున్న విజయ్‌ మానె, వెంకటరమణ మన్నం, సతీశ్‌ వేమూరి, ఫెర్డినాండో శిల్వాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో ఉద్యోగులను అందించే సంస్థలను ఈ నలుగురూ గతంలో నడిపేవారు.