జమ్మూ కాశ్మీర్లో మంచు తుఫాన్..10 మంది బలి

జమ్మూ కాశ్మీర్లో మంచు తుఫాన్..10 మంది బలి

జమ్మూ కాశ్మీర్‌లోని మంచు పెళ్లలు విరిగి పడిన సంఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఇందులో ముగ్గురు భారత సైనికులు ఉన్నారు. సోన్‌మార్గ్‌తో పాటు కుప్వారా జిల్లాలో భారీగా మంచుకురుస్తోంది. కుప్వారాలోని మంచిల్ సెక్టార్‌లో ఆర్మీ క్యాంప్ మీద మంచు పెళ్లలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. మంచు పెళ్లల కింద చిక్కుకుపోయిన సైనికుల్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సోన్‌మార్గ్‌లోని కులాన్ గ్రామంలోనూ ఐదుగురు వ్యక్తుల్ని బలి తీసుకుంది హిమపాతం. రామ్‌పూర్, గురేజ్ సెక్టార్‌లోనూ మంచు తీవ్రంగా కురుస్తోంది.