4 - 10 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

4 - 10 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కనబడతాయి. మిత్రుల సహకారంతో వాటిని ఛేదించండి. ఒక విషయంలో నిరాశ ఎదురవుతుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన కార్యాల్లో అప్రమత్తత అవసరం. వృథా ప్రయాణాలున్నాయి. ముఖ్య వ్యక్తుల సూచనలతో విజయం. ఓర్పుగా సమాధానాలివ్వండి.

వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
కార్యసిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలున్నాయి. పెద్దవారి నుంచి ఆశీర్వాద బలం ఉన్నది. మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పట్టువదలకుండా కృషి చేయండి. ఆర్థికంగా శుభకాలం. అనవసర ఖర్చు తగ్గించండి. ప్రశాంత వాతావరణం ఉంది. ఆశయం నెరవేరుతుంది.

మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
పట్టుదలే విజయాలకు మూలం. కొన్ని ఇబ్బందులున్నప్పటికీ తెలివిగా ప్రవర్తించండి. కాలం వ్యతిరేకిస్తుంది.. ఆత్మశక్తితో ఎదిరించండి. ధనలాభం సూచితం. గృహంలో శుభకార్యాలు. ఆపదలు తొలగుతాయి. ఓర్పుతో వ్యవహరించండి. గతంలో చేసిన మంచి ఇప్పుడు కాపాడుతుంది. వ్యాపార విజయం ఉంది. శుభవార్త వింటారు.  

కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
అదృష్టం చక్కగా ఉంది. ప్రోత్సాహం కోసం ఎదురుచూడొద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ఈర్ష్య పడతారు. ఎదుటివారి మాటలు విని మానసికంగా బాధపడొద్దు. భవిష్యత్తులో గొప్ప లాభం ఉంది. పట్టుదల సడలకుండా పనిచేయండి. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
బ్రహ్మాండమైన శుభ విశేష కాలం ఇది. పట్టుదలతో చేసే కార్యాలు విజయాన్నిస్తాయి. స్వయంగా తీసుకునే నిర్ణయమే మంచిది. ప్రతిభను ప్రదర్శించండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శుభవార్త వింటారు. అవగాహనతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థికంగా ఉత్తమకాలం. 

కన్య 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
కార్య సిద్ధి ఉంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. చెడు గురంచి ఆలోచించొద్దు. శత్రు పీడ ఉంటుంది. ఇంట్లో వారితో విభేదాలొద్దు. ముందుగానే పనులు ప్రారంభించండి. వారం మధ్యంలో శుభం కలుగుతుంది. కుటుంబసభ్యుల సూచనలు పాటించండి. ఆర్థికంగా ఖర్చు పెరుగుతుంది.

తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
నిరంతరమైన పట్టుదలతో కార్యసిద్ధిని పొందుతారు. మనస్సులో వచ్చే ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. భవిష్యత్తు శుభప్రదం. అన్నీ సహకరిస్తాయి. ఏకాగ్రతతో గొప్ప పేరు వస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలున్నాయి. అనుకున్నది పక్కనే ఉంటుంది. ఆత్మబలం పరిపూర్ణంగా ఉంది.

వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
అదృష్ట యోగం పడుతుంది. సరైన ప్రణాళిక ద్వారా విజయం ఉంది. పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ఆర్థికంగా పురోగతి ఉంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ అధికమైనా మంచి జరుగుతంది. విమర్శించే వారు ఎదురవుతారు. శుభవార్త వింటారు. భూలాభ సూచితం. వాహన సౌఖ్యాలు పెరుగుతాయి.

ధనుస్సు  
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
శ్రమ పెరుగుతంది. అనుకున్నది సాధిస్తారు. దగ్గరవారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయత్నలోపం లేకుండా చేయండి. చైతన్యవంతంగా ముందడుగు వేయండి. వ్యాపారంలో మోసపోయే పరిస్థితి ఉంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. తెలివిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి

మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
శ్రద్ధతో పనిచేసి ప్రశంసలందుకుంటారు. విఘ్నాలున్నాయి. పట్టుదలతో పనిచేయండి. మనసులోని కోరిక తీరుతుంది. ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపార లాభం విశేషంగా ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. కాలం అనకూలంగా ఉంది. అనుకున్నది దక్కుతుంది. కలహాల జోలికి వెళ్లొద్దు.

కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
శుభప్రదమైన ఫలితాలున్నాయి. ఒత్తిడి కలగకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సంకల్ప బలం రక్షిస్తుంది. ఊహల్లో జీవించొద్దు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. సమస్యలు తొలగుతాయి. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. 

మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
ఉత్తమ కాలం నడుస్తుంది. ధర్మమార్గంలో ప్రయత్నం విజయాన్నిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. చంచలత్వం తొలగతుంది. నూతనాంశాల్లో ప్రవేశం ఉంటుంది. ధైర్యం అవసరం. శుభవార్త శక్తినిస్తుంది. గౌరవం పెరుగుతంది. ఆరోగ్యం మిశ్రమంగా గోచరిస్తుంది.

డా . శంకరమంచి రామకృష్ణ శాస్త్రి..