ఒక్క షెడ్యూల్ కోసం 40 కోట్లు 

ఒక్క షెడ్యూల్ కోసం 40 కోట్లు 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. కేవలం నైట్ ఎఫెక్ట్స్ తో మాత్రమే ఈ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. 

కేవలం ఈ షెడ్యూల్ కోసమే నిర్మాత రామ్ చరణ్ దాదాపు 40 కోట్ల రూపాయలను వెచ్చించారట. సినిమాకే హైలెట్ గా ఈ సీక్వెన్స్ నిలవనుందట. దీనిని హాలీవుడ్ నిపుణుల సమక్షంలో తెరకెక్కిస్తుండడం విశేషం. దింతో సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లకు చేరుకుంది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరుకి గురువు పాత్రలో కనిపించనుండగా, నయనతార సతీమణి పాత్రలో మెరవనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.