న్యూజిలాండ్‌లో కాల్పులు.. 49కి చేరిన మృతులు..

న్యూజిలాండ్‌లో కాల్పులు.. 49కి చేరిన మృతులు..

న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 49కి చేరింది. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మసీదులపై ప్రార్థన సమయంలో దుండగులు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రెండు మసీదులు రక్తసిక్తమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని ప్రజలెవరు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. 

ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటిలో తప్పించుకుంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న.. బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు.  ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు.