సాహో లో ఆ 40 నిమిషాలే కీలకం..!!

సాహో లో ఆ 40 నిమిషాలే కీలకం..!!

సాహో సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈనెల 15 వ తేదీతో ముగిసింది.  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండటంతో పోస్ట్ ఫోన్ చేశారు.  ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా కొంచం ఆలస్యంగా అంటే ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  

ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  మొత్తం మూడు గంటల సినిమాలో 40 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట.  ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని థ్రిల్ కు గురిచేస్తాయని యూనిట్ భావిస్తోంది.  యాక్షన్ సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తున్నది.  సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.