విమానంలో మంటలు.. 41 మంది మృతి..

విమానంలో మంటలు.. 41 మంది మృతి..

విమానంలో చెలరేగిన మంటలు 41 మందిని పొట్టనబెట్టుకుంది. రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. టేకాఫ్‌ సమయంలో విమానం వెనుభాగం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 41 మంది ప్రయాణకులు మృతిచెందారు. ఘటనా సమయంలో విమానంలో 78 మంది ఉండగా... మిగతా 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వెనుకభాగంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందువైపు ద్వారం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 41 మంది మృతిచెందగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.