భారత బ్యాట్స్మెన్స్ ను ఏం చేయలేక అలా చేశాం : ఆఫ్రిది

భారత బ్యాట్స్మెన్స్ ను ఏం చేయలేక అలా చేశాం : ఆఫ్రిది

పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది 2006 లో భారత్‌తో జరిగిన లాహోర్ టెస్ట్ గురించి మాట్లాడి అక్కడి ఫ్లాట్ వికెట్ వలన తన జట్టు బౌలర్లు బాధను  అధిగమించడానికి జోకులు వేసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో భారతీయ ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ 410 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. వీరేందర్ సెహ్వాగ్ తన పద్ధతిలో 247 బంతుల్లో 254 పరుగులు చేశాడు, రాహుల్ ద్రవిడ్ 233 బంతుల్లో 128 పరుగులు చేసి మ్యాచ్లో అజేయంగా నిలిచాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసినప్పుడు, భారత్ 1 వికెట్ నష్టానికి 410 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. వివిఎస్ లక్ష్మణ్ (3 బంతుల్లో 0) ద్రవిడ్‌తో తిరిగి పెవిలియన్‌కు వెళ్లాడు.

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేసి ఇది ఎప్పటిదో ఊహించండి అని అడిగింది, అయితే దానికి షాహిద్ అఫ్రిది సమాధానం ఇచ్చారు. చిత్రంలో షాహిద్ అఫ్రిది మరియు షోయబ్ అక్తర్ మనస్ఫూర్తిగా నవ్వడం చూడవచ్చు. "గొప్ప జ్ఞాపకాలు, 2006 లో భారతదేశానికి వ్యతిరేకంగా లాహోర్లో నా అభిమాన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాను. అయితే మాములుగా షోయబ్ ఎప్పుడూ బ్యాట్స్మెన్లకు వణుకు పుట్టిస్తాడు, కానీ ఇది చాలా ఫ్లాట్ వికెట్ కాబట్టి భారత ఆటగాళ్ల వికెట్ తీయలేకపోవడం తో మా బౌలర్లు వారి బాధను అధిగమించడానికి జోకులు వేసుకున్నాము" అని అఫ్రిది అన్నారు.

2006 జనవరిలో లాహోర్ టెస్ట్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. 7 వికెట్లు కోల్పోయిన తరువాత పాక్ 679 పరుగులు చేసిన మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తన జట్టు కోసం 199 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్ సెంచరీలు సాధించారు.