భారత్ లో తగ్గిన కరోనా కేసులు... మరణాలు
ప్రపంచంలో కరోనా ఉదృతి పెరుగుతున్నా ఇండియాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కి చేరింది. ఇందులో 87,59,969 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,54,940 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 485 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,36,200కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)