పోలీసుల పహారాలో ఢిల్లీ.. రక్షణ వలయంలో కాశ్మీర్ 

పోలీసుల పహారాలో ఢిల్లీ.. రక్షణ వలయంలో కాశ్మీర్ 

ఈనెల 31 వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలు అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారబోతున్నాయి.  దీంతో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెంట్స్ వర్గాల నుంచి సమాచారం అందటంతో రెండు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలను తీసుకున్నారు.  

జమ్మూ కాశ్మీర్లో గత రెండు రోజుల్లో ఆరుసార్లు ఉగ్రవాదులు సామాన్య ప్రజలపై దాడులు చేయడంతో సైన్యం అలర్ట్ అయ్యింది.  ఇటు ఢిల్లీని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు.  అణువణువునా గాలిస్తున్నారు.  అనుమానితులనుఅదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  ప్రధాని మోడీ, రాష్ట్రపతి, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్రముప్పు ఉందని సమాచారం అందటంతో భద్రతను మరింత పెంచారు.  48 గంటలపాటు ఢిల్లీలో హైఅలర్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.