ఇండియాలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు... 

ఇండియాలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు... 

ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇప్పటికే దేశంలో 80 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 49,881 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203కి చేరింది.  ఇందులో 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,03,687 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  కేసుల సంఖ్య దేశంలో మళ్ళీ క్రమంగా పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది.