ఇంగ్లాండ్-వెస్టిండీస్ : నాలుగో రోజు పై చేయి సాధించిన ఆతిథ్య జట్టు 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : నాలుగో రోజు పై చేయి సాధించిన ఆతిథ్య జట్టు 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో జరిగిన నాలుగో రోజు ఆటలో పై చేయి సాధించింది ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్. తమ రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులతో నిన్న ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్  ఆటగాళ్లు రోజు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 170 పరుగుల ఆధిక్యాని సంపాదించారు. ఇందులో..  జాక్ క్రాలే (76), డామ్ సిబ్లీ(50),  బెన్ స్టోక్స్(46),  రోరే బర్న్స్ (42) పరుగులతో రాణించారు. ఇంకా కరేబియన్ బౌలర్లు  షానన్ గాబ్రియేల్ 3 వికెట్లు,  రోస్టన్ చేజ్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా కెప్టెన్  జాసన్ హోల్డర్ ఒక వికెట్ తినుకున్నారు. ఇక ఆట ముగిసే సమయానికి  జోఫ్రా ఆర్చర్(5),  మార్క్ వుడ్(1) బ్యాటింగ్ చేస్తున్నారు.