అయోధ్య కేసు: నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ

అయోధ్య కేసు: నేటి నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది... అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన 14 పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. సాధారణ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ విచారణ అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠను పెంచుతోంది. ఉదయం 10.30 గంటలకు చీఫ్ జస్టిస్ చాంబర్‌లో విచారణ మొదలుకానుంది. సాధారణంగా భూ వివాదాలను ఇద్దరు సభ్యుల ధర్మాసనాలు విచారిస్తుంటాయి. అయోధ్యకేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించాలని గతంలో పిటిషనర్లు విజ్ఞప్తి చేసినా మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అందుకు అంగీకరించలేదు. రాజ్యాంగ ధర్మాసనం అవసరమే లేదని, ముగ్గురు జడ్జిల బెంచ్ విచారిస్తుందని గతంలోనే తేల్చిచెప్పారు. అయితే పాత ఉత్తర్వులను కొత్త చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ పూర్తిగా పక్కన పెట్టేశారు. అనూహ్యంగా ఐదుగురు జడ్జిలతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.