ఐదుగురి ప్రాణాలు తీసిన మితిమీరిన వేగం...

ఐదుగురి ప్రాణాలు తీసిన మితిమీరిన వేగం...

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది... మంచాల మండలం లింగంపల్లి గేట్ దగ్గర ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. కూరగాయాలు అమ్మేందుకు ఇబ్రహీంపట్నం వైపు ఆటోలో వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు చెన్నారెడ్డిగూడ వాసులుగా గుర్తించారు పోలీసులు... ప్రమాదసమయంలో ఆటోలో 11 మంది ప్రయాణికులతో పాటు కూరగాయలు ఉన్నాయి... అయితే మితిమీరిన వేగంతో ఎదురుగా దూసుకొచ్చిన కారు... ఆటోను ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది... ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా... ఆస్పత్రిలో తరలిస్తుండుగా మరొకరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతిచెందగా... గాయాలపాలైన మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.