విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్

విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్

మరోసారి కాల్పులతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది.. జిల్లాలోని జీకే వీధి మండలం మాదిగమల్లులో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల ఆవిర్భావోత్సవాలు జరుగుతోన్న నేపథ్యంలో.. పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ధారకొండ ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. ఇక, ఘటనా స్థలంలో ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.