పాక్ లో దారుణం: హిందూ కుటుంబాన్ని నరికి చంపిన దుండగులు 

పాక్ లో దారుణం: హిందూ కుటుంబాన్ని నరికి చంపిన దుండగులు 

పాకిస్తాన్ లో ఓ దారుణం చోటు చేసుకుంది.  పాక్ లో మైనారిటీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.  నిత్యం అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.  ఇటీవలే రహీమ్ యార్ ఖాన్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబి కాలనీలో నివసించే రామ్ చంద్ అనే వ్యక్తిని, అతని కుటుంబాన్ని కొంతమంది దుండగులు అతిదారుణంగా హత్య చేశారు.  పదునైన ఆయుధాలతో దాడిచేసి వారిని హతమార్చారు.  కుటుంబంలోని మొత్తం ఐదుగురిని హత్య చేయడంతో ఆ ప్రాంతం షాక్ అయ్యింది.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మేఘావాల్ హిందూ కమ్మూనిటీకి చెందిన రామ్ చంద్ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, ప్రశాంతంగా జీవనం సాగించే వ్యక్తి కుటుంబం ఇలా హత్యకు గురికావడంపై అక్కడి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.