5 శాతం పెరిగిన ముడి చమురు 

5 శాతం పెరిగిన ముడి చమురు 

ముడి చమురు సరఫరా తగ్గించేందుకు ఒపెక్‌ దేశాలు అంగీకరించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు 5 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఒపెక్‌ నుంచి వైదొలగిన ఇరాన్‌ కూడా... ఒపెన్‌ నిర్ణయానికి అనుగుణంగా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించింది. ఈ శీతాకాలంలో చమురు ఉత్పత్తి తగ్గించడం కష్టమని చెప్పిన రష్యాపై ఇపుడు ఒపెక్‌ దృష్టి పెట్టింది. ఎలాగైనా సరఫరా తగ్గించేందుకు రష్యాను ఒప్పటించాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. తాజా రేట్ల ప్రకారం ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63డాలర్లపైనే ట్రేడవుతుండగా, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర 54 డాలర్లపైనే ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా ఉండటంతో సోమవారం మార్కెట్‌ ఓపెన్‌ అయ్యే సమయానికి రూపాయి కనీసం అర్ధ రూపాయి బలహీనపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.