జార్ఖండ్ లో ఎన్‌కౌంటర్, ఐదుగురు పోలీసులు మృతి

జార్ఖండ్ లో ఎన్‌కౌంటర్, ఐదుగురు పోలీసులు మృతి

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతమైన సరైకెలా జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఎస్ఐలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు. అనంతరం పోలీస్ వాహనంలోని ఆయుధాలను ఎత్తుకెళ్లారు. గత నెల 28న ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది కోబ్రా కమాండెంట్‌లతో సహా మొత్తం 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.