హైదరాబాద్ చందానగర్ లో విషాదం..

హైదరాబాద్ చందానగర్ లో విషాదం..

హైదరాబాద్ చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంజీర డైమండ్ టవర్స్ లోని స్మిమ్మింగ్ పూల్ లో పడి ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గేటెడ్ కమ్యూనిటీ వారి నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్మిమ్మింగ్ పూల్ నిర్వహణ సరిగా లేదని పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.