పెళ్ళిలో విషాదం.. ఐదేళ్ల చిన్నారి హత్య.. 

పెళ్ళిలో విషాదం.. ఐదేళ్ల చిన్నారి హత్య.. 

దేశంలో చిన్న పిల్లల హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  అభం శుభం తెలియని చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తున్నారు. చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  రీసెంట్ గా చిత్తూరులో ఇలాంటి ఘటన ఒక జరిగింది.  

ఐదు సంవత్సరాల చిన్నారిని అర్ధరాత్రి కొందరు దుండగులు అపహరించి అతి కిరాతకంగా హత్య చేశారు.  ఏదైనా కక్ష్యలు కారణంగా హత్య చేసారా లేదంటే మరో కోణంలో ఏమైనా ఉన్నదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లి వేడుకకు చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి హాజరైంది.  అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.  ఆ వేడుకకు వెనకవైపు భాగంలో చిన్నారిని హత్య చేశారు.  ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.