జీహెచ్‌ఎంసీలో 50 సర్కిళ్లు, 10 జోన్లు...

జీహెచ్‌ఎంసీలో 50 సర్కిళ్లు, 10 జోన్లు...

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరిన్ని సర్కిళ్లు, జోన్‌లు పెరగనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది... గతంలో ఐదు జోన్లు ఉంటే కొద్ది రోజుల క్రితమే ఆరు జోన్లకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం... త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో 50 సర్కిళ్లు, 10 జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా 50 సర్కిళ్లు, 10 జోన్లకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధనరెడ్డికి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధమై... ప్రభుత్వ ఆమోదం పొందితే... ప్రస్తుతం 30 సర్కిళ్లు, 6 జోన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ... 50 సర్కిళ్లు, 10 జోన్లుగా అవతరించనుంది.