అరుదైన ఘనత.. పుజారా అచ్చం ద్రవిడ్ లాగే
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. 123 పరుగులు చేసిన పుజారా టెస్టుల్లో ఐదు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 108 ఇన్నింగ్స్‌లలో పుజారా ఐదు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా 108 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ద్రవిడ్ 67 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు సాధించగా.. 84 ఇన్నింగ్స్‌లలో 4 వేల పరుగులను పూర్తి చేసాడు. పుజారా అచ్చం ద్రవిడ్ లాగే.. 3 వేల పరుగులను 67 ఇన్నింగ్స్‌లలో.. 4 వేల పరుగులను 84 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేసాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)