కర్నూలులో 51 అడుగుల భారీ మట్టి గణనాథుడు

కర్నూలులో 51 అడుగుల భారీ మట్టి గణనాథుడు

కర్నూలు జిల్లా పాతబస్తి తుంగభద్ర నది ఒడ్డున పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్ష్మీనరసింహ స్వామి కమిటీ ఆధ్వర్యంలో 51 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని రూపొందించారు. వినాయక చవితిని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఏరాసు, సోమిశెట్టి.. మట్టి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు పూజలందుకున్న మట్టి వినాయకుడిని అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ మట్టి వినాయకుడి కోసం రూ. 15లక్షలు ఖర్చు చేశారు.