తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే...

తెలంగాణ కరోనా అప్డేట్: ఈరోజు ఎన్నంటే...

తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది.  తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు 2,69,816 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 2,58,336 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  10,022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1458 మంది మృతి చెందారు.  తెలంగాణలో కొత్తగా 1058 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.