రెండు ఎన్‌కౌంటర్లు, ఆరుగురు మావోలు మృతి

రెండు ఎన్‌కౌంటర్లు, ఆరుగురు మావోలు మృతి

ఒడిశా మరోసారి ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లింది... ఈ రాష్ట్రంలో ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు జరగగా... ఈ రెండు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నాఉ. కంధమాల్ జిల్లాలోని సుదుకుంప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలికడప గ్రామం దగ్గర  జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించగా... వారి దగ్గర నుంచి ఏకే 47తో పాటు ఇన్సాఫ్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక బలంగిరి దగ్గర జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు... మొత్తం ఎనిమిది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది.