త్వరలోనే ఎన్నికలు.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు..

త్వరలోనే ఎన్నికలు.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు..

తాజాగా రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలో తిరిగి బీజేపీ అధికారం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి... మరోవైపు త్వరలోనే జార్ఖండ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. ముందే, బీజేపీ గూటికి చేరుతున్నారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు.. జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.. ఇవాళ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రఘుబార్‌దాస్‌ సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కునాల్ సారంగి, జేపీ భాయి పటేల్, చమ్రా లిండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుఖ్‌దేవ్ భగత్, మనోజ్ యాదవ్‌తో పాటు నవ జవాన్ సంఘర్ష మోర్చాకు చెందిన ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహీ.. బీజేపీలో చేరారు. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. జార్ఖండ్‌లో ఎన్నికలకు జరగనుండడంతో.. మళ్లీ బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.