మద్యం మత్తులో.. స్టేడియంలో హల్‌చల్‌ 

మద్యం మత్తులో.. స్టేడియంలో హల్‌చల్‌ 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతానైట్‌రైడర్స్‌ మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆరుగురు యువతీయువకులు మద్యం తాగి వచ్చారు. మ్యాచ్‌ జరుగుతుండగానే గ్యాలరీలో నానా హంగామా సృష్టించారు. ఇతర వీక్షకులను గేలి చేస్తూ రచ్చరచ్చ చేశారు. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చశాడు. దీంతో.. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై కేసు నమోదు చేశారు.