చివరి బంతికి 6 రన్స్ కావాలి.. కానీ బంతి పడకుండానే విజయం

చివరి బంతికి 6 రన్స్ కావాలి.. కానీ బంతి పడకుండానే విజయం

చివరి బంతికి 6 రన్స్ కావాలి.. కానీ బంతి పడకుండానే విజయం సాధించింది ఓ క్రికెట్ జట్టు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఆదర్శ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో దేశాయ్, దోంబిలీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటుచేసుకుంది. 76 పరుగుల లక్ష్యంతో దేశాయ్ జట్టు బరిలోకి దిగింది. చివరి బంతికి ముందు 70/4తో ఉంది. దేశాయ్ గెలవాలంటే చివరి బంతికి ఆరు పరుగులు చేయాలి. ఈ సమయంలో దోంబిలీ జట్టు బౌలర్ వరుసగా ఆరు వైడ్లు వేసేశాడు. దీంతో దోంబిలీ బ్యాట్స్‌మన్‌కు ఒక్క పరుగు కూడా కొట్టాల్సిన అవసరం లేకుండానే టార్గెట్ పూర్తయింది. దోంబిలీ నాన్ స్ట్రైకర్ సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు దోంబిలీ బౌలర్ ఆ జట్టు ఆటగాళ్ల కోపానికి గురయ్యాడు. దీనికి సంబందించిన వీడియోను ఓ క్రికెట్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.