కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థత

కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కస్తూర్బా పాఠశాలలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి కస్తూర్బా బాలికల వసతి గృహంలోని విద్యార్థులకు నిర్వాహకులు ఫ్రూట్ సలాడ్ ఇచ్చిన అనంతరం భోజనం పెట్టారు. వసతి గృహంలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా.. 67 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా, అనంతరం వాంతులు చేసుకున్నారు. వీరిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పాఠశాలకు చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.