దేశంలో మళ్ళీ పెరిగిన కేసులు.. 24 గంటల్లో

దేశంలో మళ్ళీ పెరిగిన కేసులు.. 24 గంటల్లో

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. గడిచిన  24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు నమోదవగా..  933 మంది మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 20,88,612కు చేరింది. అదేవిధంగా కరోనా మృతులు 42,518కి పెరిగారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,19,088 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. కరోనాబారిన పడిన మరో 14,27,006 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. నిన్న ఒక్క రోజే 5,98,778 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,33,87,171 శాంపిల్స్‌ను పరీక్షించారు.