కరోనాతో అమెరికా అతలాకుతలం... భారీ సంఖ్యలో కేసులు నమోదు 

కరోనాతో అమెరికా అతలాకుతలం... భారీ సంఖ్యలో కేసులు నమోదు 

కరోనా ప్రపంచాన్ని పట్టి  పీడిస్తోంది. చైనా, యూరప్ లో కరోనా కేసులు తక్కువగా  నమోదవుతున్నాయి.  అక్కడ దాదాపుగా కరోనా అదుపులోకి వచ్చింది.  అయితే, అమెరికాలో మాత్రం కరోనా కంట్రోల్ కావడం లేదు.  ఏప్రిల్ నుంచి కరోనా కేసులు తగ్గినట్టు కనిపించినా, జూన్ నుంచి  అక్కడ పరిస్థితి మారిపోయింది.  

కరోనా కేసులు తిరిగి పెరగడం మొదలుపెట్టాయి.  అక్కడ ప్రతిరోజూ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  తాజా సమాచారం ప్రకారం అమెరికాలో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు అక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 34,77,993కి చేరింది.  కరోనా కారణంగా నిన్నటి రోజున 452 మంది మరణించారు.  దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 1,38,234కి చేరింది.  రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  డిసెంబర్ వరకు ఈ కేసుల సంఖ్య మరో 40శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.